హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు రోజుకు రూ.320 కోట్లు, గంటకు రూ.13 కోట్ల చొప్పున అప్పు చేస్తున్నదని, అయినా పెండింగ్ బకాయిలు విడుదల చేయడంలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ప్రభుత్వం వెంట నే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్థాని క సంస్థల ఎన్నికలు నిర్వహించడంలేదని ధ్వజమెత్తారు. ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.