హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు ఇన్ని నిబంధనలు ఎందుకు విధిస్తున్నారని బీజేపీ ఎల్పీనేత ఏలేటి మహేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేషన్‌కార్డు నిబంధన పెట్టి చాలా మందికి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.రీ షెడ్యూ ల్ అయిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామనడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిబంధనలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు గ్రామపంచాయతీలకు, పట్టణ స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయాలంటూ లేఖ రాశారు.