హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని ప్రభు త్వం వెంటనే అమలు చేయాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బీజేపీ రా ష్ట్ర కార్యాలయంలో మీడియాతో మా ట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 21 హామీల అమలు ఏ మైందని ప్ర శ్నించారు. మంత్రి వర్గంలో 42 శా తం బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ డిక్లరేషన్ చేసిన కామారెడ్డి అసెంబ్లీ సీటును కూడా బీ సీలకు ఇవ్వలేదని విమర్శించారు. కులగణ నపై మాట్లాడే రాహుల్ ఏ కులమో, ఏ మతమో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ -ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పారు.