కుమ్రం భీం: కాగజ్‌నగర్ అడవుల్లో బర్డ్స్ వాక్ ఫెస్టివల్ (birds walk festival) ప్రారంభమయింది. బర్డ్స్ వాక్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. దీంతో శని, ఆదివారాల్లో కాగజ్‌నగర్, సిర్పూర్, పెంచికలపేట, బెజ్జూరు, చింతలమానేపల్లి అటవీ ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ నెలకొననుంది. ఇందులో భాగంగా అధికారులు అటవీ ప్రాంతంలోని చెరువులు, కుంటలు, గడ్డి వనాలను చూసే అవకాశం కల్పించారు. ఒక్క కాగజ్‌నగర్ డివిజన్‌లోనే 250 రకాల పక్షిజాతులు ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ పర్యాటకులను వీనులవిందు చేయనున్నాయి.
2019 డిసెంబర్లో అధికారులు బర్డ్స్ వాక్‌ను ప్రారంభించారు. దీనికి ప్రకృతి ప్రేమికుల నుంచి విశేష స్పందన వస్తున్నది. దీంతో ప్రతి ఏడాది దీనిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పర్యాటకుల కోసం అటవీశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. అవసరమైన చోట పర్యాటకులను జీపులో తీసుకున్నారు. అటవీ ప్రాంతంలోనే రాత్రి బస ఏర్పాట్లు చేశారు.