హైదరాబాద్ : కారు హారన్( Car horn) కొట్టడమే ఆ డ్రైవర్(Car driver )నేరమైంది. హారన్ కొట్టడంతో కోపోద్రిక్తులైన కొందరు దుండగులు కారు డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన వరంగల్ జిల్లాలో(Warangal) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాటోతు నాగన్న అనే కారు డ్రైవర్‌కు శంభునిపేట జంక్షన్ వద్ద ఓ బైకు కారుకు అడ్డు వచ్చింది.
దీంతో నాగన్న హారన్ కొట్టాడు. హారన్ ఎందుకు కొడుతున్నావంటూ.. కొందరు వ్యక్తులు(Bikers attack) అతనిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.
హారన్ ఎందుకు కొట్టావంటూ కారు డ్రైవర్ పై దాడి
హాన్మకొండ – జాటోతు నాగన్న అనే కారు డ్రైవర్‌కు శంభునిపేట జంక్షన్ వద్ద ఓ బైకు కారుకు అడ్డురావడంతో హారన్ కొట్టాడు. హారన్ ఎందుకు కొడుతున్నావంటూ.. కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు.
బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. pic.twitter.com/jzrxExGBDD
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2024