హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కత్తిగంటి శ్రీనివాస్‌రావుకు బిహార్ ప్రభుత్వ రాజభాషా పురస్కారం దక్కింది. శనివారం పట్నాలో జరిగిన కార్యక్రమంలో బిహార్ సీఎం నితీశ్‌కుమార్ చేతులమీదుగా పురస్కారంతోపాటు రూ.లక్ష నగదు అందుకున్నారు. తెలుగువాడైన శ్రీనివాస్‌రావుకు హిందీ పురస్కారం దక్కడంపై సాహితీవేత్తలు, రచయితలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.