హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులను గాలికొదిలేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా విమర్శించారు. దేశ చరిత్రలో ఎకడాలేని విధంగా తెలంగాణలో వింత సంసృతికి కాంగ్రెస్ తెరలేపిందని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా ప్రతిపక్ష నేతల ప్రైవేట్ ఆస్తుల మీదికి దాడులకు వెళ్లడం అప్రజాస్వామికమని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫార్మ్హౌస్లపైకి కాంగ్రెస్ నేతలు దండెత్తి వెళ్లడం ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర మాత్రమేనని పేరొన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత ప్రాంగణాల్లోకి చొరబడుతున్నారని విమర్శించారు.