పింఛన్ల పెంపు ఏదీ ? : లకావత్ గిరిబాబు
కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే కొత్త పింఛన్ల పేరుతో సర్కారు నాటకాలు ఆడుతోందని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో...
జూలూరుపాడు, నవంబర్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే కొత్త పింఛన్ల పేరుతో సర్కారు నాటకాలు ఆడుతోందని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దివ్యాంగుల పింఛన్‌ను రూ.4 వేల నుండి రూ.6 వేలకు, ఇతర ఆసరా పింఛన్లను రూ.2 వేల నుండి రూ.4 వేలకు పెంచుతామని గొప్పలు చెప్పిందని ఎద్దేవా చేశారు. హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ ఎందుకు అమలు చేయడం లేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. కొత్తగా అర్హత సాధించిన వృద్ధులు, బీడీ కార్మికుల నుండి కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించకుండా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కొత్త పింఛన్ల పేరుతో ప్రకటనలకే పరిమితం కాకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాలను వెంటనే పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింఛన్ల పెంపు ఏదీ ? : లకావత్ గిరిబాబు
వడ్డేపల్లి దామోదర్ రెడ్డి మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Arrest | ‘ఒక లిప్‌కిస్ ఇయ్యవా ప్లీజ్’.. థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్‌కు ఉదయ్‌పూర్ వ్యక్తి వేధింపులు..!
బీఆర్ఎస్ సర్పంచులపై ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చిందులు
MP Avinash Reddy | సర్పంచ్ ఎన్నికలైనా ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి : వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

