ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తున్నది. శనివారం ఉదయం నుంచి నేరడిగొండ, బోథ్, ఆదిలాబాద్, బజార్ హత్నూర్, ఇచ్చోడ మండలాల్లో వర్షం కురుస్తున్నది. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాలో వాతారణం చల్లబడింది. ఇన్నిరోజులు ఎండలు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. జిల్లాలోని భోరజ్‌లో శనివారం 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కాగా, రాష్ట్రంలో నాలుగు రోజులపాటు మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్ర తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది.