హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని నవీ ముంబైలో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబైలో సుమారు 10 ఎకరాల స్థలం కేటాయించింది.