యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వారు భువనగిరిలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే పోచంపల్లిలో ఐఐహెచ్‌టీ మంజూరు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినట్టు చెప్పా రు. మాజీ మంత్రి కేటీఆర్ అనేకసార్లు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి.. ప ట్టుబట్టి ఐఐహెచ్‌టీ మంజూరు చేయించేందుకు ఎంతో కృషి చేశారని తెలిపా రు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఓర్వలేక ఐఐహెచ్‌టీని రంగారెడ్డి జిల్లాకు తరలించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేస్తానని గతంలో నే రేవంత్‌రెడ్డి అన్నారని, ఆ మేరకే ఐఐహెచ్‌టీని తరలించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పోచంపల్లి మండలంలోని కనుముక్కలలో ఏర్పాటు చేయాలని జీవోలో స్పష్టంగా ఉన్నా ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. కనుముక్కలలో హ్యాండ్లూమ్ పార్కును వేలంలో కొనుగోలు చేశామని, గతేడాది మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు సైతం అక్కడ పర్యటించిన విషయాన్ని వారు గుర్తుచేశారు. ఐఐహెచ్టీఎం తరలింపును మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఎందుకు అడ్డుకోలేక పోతున్నారని ప్రశ్నించారు. స్కిల్ యూనివర్సిటీని కూడా పోచంపల్లిలోని రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.