హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 9న రాష్ట్రంలో కొత్త విద్యుత్తు పాలసీని ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడించారు. దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ ఎంతగానో దోహదపడనున్నట్టు తెలిపారు. సోమవారం సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఇటీవల జెన్కోలో ఉద్యోగాలు పొందిన ఏఈలు, కెమిస్ట్‌లకు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జీఎస్డీపీలో విద్యుత్తు రంగం కీలకపాత్ర పోషిస్తున్నదని తెలిపారు.
టీటీడీ లైజన్ ఆఫీసర్‌కు యాదగిరిగుట్ట వేతనం
యాదగిరిగుట్ట, జనవరి 6 : టీటీడీ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన లైజన్ ఆఫీసర్‌గా నియమించిన గణేశ్‌కుమార్‌కు యాదాద్రి దేవస్థానమే ప్రతి నెల రూ.లక్ష చొప్పున రెండేండ్లు లేక పదవీకాలం పూర్తయ్యే వరకు చెల్లించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈవోతో పాటు, 1,050 మంది ఉద్యోగుల జీతాల కోసం నెలకు రూ.4 కోట్లు ఖర్చు భరించాల్సి ఉంటుంది.