సెక్యూరిటీ గార్డు నుంచి డ్రగ్స్ డాన్‌గా!
సెక్యూరిటీ గార్డుగా మొద లై అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠా డాన్‌గా ఎదిగిన భాస్కర్ హజారికాతోపాటు నలుగురిని గురువారం ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసి 24.7కిలోల గంజాయి, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నది.
- అసోంకు చెందిన భాస్కర్ హజారికా ముఠా అరెస్ట్
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : సెక్యూరిటీ గార్డుగా మొద లై అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠా డాన్‌గా ఎదిగిన భాస్కర్ హజారికాతోపాటు నలుగురిని గురువారం ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసి 24.7కిలోల గంజాయి, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నది. వివరాలిలా.. అసోంలోని లఖింపూర్ ప్రాంతానికి చెందిన భాసర్ 2014లో హైదరాబాద్‌కు వచ్చాడు. 2020 నుంచి 2023 వరకు సెక్యూరిటీగార్డుగా పనిచేస్తూనే గంజా యి విక్రయించడం మొదలుపెట్టాడు.
2024 జనవరి, మార్చిలో మాదాపూర్, గచ్చిబౌలి పోలీస్స్టేషన్ల పరిధిలో మూడు ఎన్డీపీఎస్ కేసుల్లో పట్టుబడ్డాడు. బెయిల్‌పై వచ్చి స్వగ్రామానికి వెళ్లి మరికొందరిని ముఠాలో చేర్చుకున్నాడు. 2025 జూన్ లో హైదరాబాద్ వచ్చి బికాస్బారిక్, ఆశీష్, దేవాశిస్తో కలిసి స్మగ్లింగ్ మొదలుపెట్టి రూ.1.80 కోట్లు ఆర్జించాడు. గంజాయి తరలిస్టూ పట్టుబడిన ఒడిశాకు చెందిన త్రిలోచన్, సాగర్బల్ అందించిన సమాచారంతో బికాస్ బారిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా భాసర్ కదలికలపై నిఘాపెట్టి ఎట్టకేలకు ముఠాగుట్టును రట్టుచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

