జాతీయస్థాయిలో మెరిసిన పల్లె కుసుమం
అంతర్జాతీయ స్థాయిలో సిస్కో నెట్ వర్కింగ్ అకాడమీ నిర్వహించిన పోటీల్లో ఓ మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి సత్తాచాటింది. వివిధ దేశాల విద్యార్థులతో పోటీపడి ప్రథమ స్థానంలో నిలిచింది.జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రా మంలో రైతు కుటుంబానికి చెందిన పొన్నాల సోమిరెడ్డి, భారతి దంపతుల కుమార్తె భాషిత ఈ ఘనత సాధించింది. భాషిత తండ్రి సోమిరెడ్డి హైదరాబాద్‌లో స్థిర పడ్డారు.
- సిస్కో రైడర్స్‌లో ఈరవెన్ను విద్యార్థిని ప్రతిభ
- 994మందితో పోటీ.. భాషితకు ఫస్ట్ ర్యాంక్
పాలకుర్తి రూరల్, మే 13: అంతర్జాతీయ స్థాయిలో సిస్కో నెట్ వర్కింగ్ అకాడమీ నిర్వహించిన పోటీల్లో ఓ మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి సత్తాచాటింది. వివిధ దేశాల విద్యార్థులతో పోటీపడి ప్రథమ స్థానంలో నిలిచింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రా మంలో రైతు కుటుంబానికి చెందిన పొన్నాల సోమిరెడ్డి, భారతి దంపతుల కుమార్తె భాషిత ఈ ఘనత సాధించింది. భాషిత తండ్రి సోమిరెడ్డి హైదరాబాద్‌లో స్థిర పడ్డారు. భాషితను ఉన్నత చదువులు చదివించారు.
ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నది. గత నెల 29న నెట్ వర్కింగ్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆసియా పసిఫిక్ జపాన్ అండ్ గ్రేటర్ చైనా (ఏపీజేసీ)నెట్ క్యాడ్ రైడర్స్ పోటీల్లో భాషిత పాల్గొన్నది. ఆన్లైన్ పోటీల్లో దేశవ్యాప్తంగా 994మంది విద్యార్థులు పాల్గొనగా.. భాషిత మొదటి స్థానంలో నిలిచిం ది. ఈ నెల 24న అంతర్జాతీయ స్థాయి ఫైనల్స్‌లో 15 దేశాలకు చెందిన టాపర్స్ తో ఆమె పోటీపడనున్నది. ఈ పోటీల్లో గ్లోబల్ టాపర్‌గా నిలుస్తానని భాషిత ధీ మా వ్యక్తం చేసింది. పల్లెలో పుట్టి పెరిగిన భాషిత ప్రపం చ స్థాయిలో ర్యాంక్ సాధించడం జనగామ జిల్లాకే గర్వకారణమని సర్పంచ్ ముస్కు నిర్మలాచంద్రబాబు, ఎంపీటీసీ కొడిశాల యాదగిరి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

