Bharat Jagruthi | రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారత జాగృతి సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషిచేయాలని సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. సంస్థాగత నిర్వహణ కోసం జిల్లాల వారీగా కమిటీ నాయకులను ప్రకటించారు. ఈ నియామకాలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపారు. భారత జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా అనంతుల ప్రశాంత్‌ను నియమించారు.
జోగులాంబ-గద్వాల జిల్లా అధ్యక్షులుగా ఎల్వీఎన్ రెడ్డి, సిద్ధిపేట అధ్యక్షులుగా పీ శ్రీధర్ రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా అప్పాల నరేందర్ యాదవ్, యాదాద్రి – భువనగిరి అధ్యక్షులుగా చందుపట్ల సుజీత్ రావు, మెదక్ జిల్లా అధ్యక్షులుగా వీరప్పగారి రమేశ్ గౌడ్, హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా మూల రాము గౌడ్ నియమితులయ్యారు.
హైదరాబాద్ జిల్లా కో కన్వీనర్‌గా బీ వేణుగోపాల్ రావు, భారత జాగృతి యువజన విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గా బొల్లంపల్లి సందీప్ నియమితులయ్యారని భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.