హైదరాబాద్: ఓరల్ కలరా టీకా (ఓసీవీ) హిల్కాల్ మూడో దశ క్లినికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తయినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బుధవారం ప్రకటించింది. దేశంలోని 10 క్లినికల్ ప్రదేశాల్లో ఒక ఏడాది వయసుగల చిన్నారుల నుంచి వయోవృద్ధుల వరకు 1,800 మంది ఈ పరీక్షల్లో పాల్గొన్నట్లు తెలిపింది.
ఓసీవీలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల డోసుల డిమాండ్ ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్, భువనేశ్వర్లలోని తమ యూనిట్లలో ఏటా 20 కోట్ల మోతాదుల హిల్కాల్ను ఉత్పత్తి చేసేందుకు భారత్ బయోటెక్ సన్నాహాలు చేస్తున్నది.