శేరిలింగంపల్లి, ఆగస్టు 24 : ప్రభుత్వం తరుఫున న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని భాగ్యనగర్ టీఎన్జీవోస్ ఉద్యోగులు తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గోపన్‌పల్లిలో కొనసాగుతున్న భాగ్యనగర్ టీన్జీవోల ఆందోళన ఆదివారంతో 40వ రోజుకు చేరింది. రాష్ట్రవాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు గోపన్‌పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకుని, తమకు న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన వ్యక్తంచేశా రు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వయం త్రాంగం నుంచి స్పందనలేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. 40 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా.. ఉద్యోగుల సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు. శాంతియుత పద్ధతిలో నిరసన కార్యక్రమా లు నిర్వహిస్తుండటంతో పాటు, న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ టీఎన్జీవోస్ అధ్యక్షుడు రాజేందర్, జనగాం అధ్యక్షుడు ఖాజాషరీఫ్, టీన్జీవోస్ నాయకులు వీ శ్రీనివాస్, పీఎన్బీ చారి, పీ రాజు, చైతన్య, శ్యామ్, ఎన్ ప్రసాద్, రమేశ్, రాజు, ప్రభాకర్ భాగ్యనగర్ టీఎన్జీవోస్ మ్యూచివల్ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం 2003లో తీసుకువచ్చిన సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు కోరుతూ ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ విధానంతో ఎక్కవ కాలం ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఉద్యోగులకు పెన్షన్ రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానా న్ని అమలు చేసేలా ఉత్తర్వులను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి బాణాల రత్నాకర్‌రావు, నాయకులు ఉ మాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.