హైదాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ ఆర్డ్మ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) విభాగాలకు యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో తాను మెంటరింగ్ చేసిన స్టూడెంట్స్ ఉత్తమ ఫలితాలు సాధించినట్టు సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ సోమవారం వెల్లడించారు. సోమవారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఇంటర్వ్యూకు తాను మెంటార్ చేసిన ఆరుగురు విద్యార్థులు టాప్-20లో ర్యాంకులు సాధించారని వెల్లడించారు. వీరిలో రాజస్థాన్‌కు చెందిన రాజన్ లోహియా ఆలిండియా ఫస్టు ర్యాంకు సాధించినట్టు చెప్పారు. తమిళనాడుకు చెందిన విజయ్ 6వ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాయవరపు రవితేజ 8వ, ఢిల్లీకి చెందిన ఆనం జెభా 9వ ర్యాంకులు సాధించారని వివరించారు.