Bhagiratha Maharshi | 27న అధికారికంగా భగీరథ మహర్షి జయంతి.. హర్షం వ్యక్తం చేసిన వకుళాభరణం
Bhagiratha Maharshi | కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు.
Bhagiratha Maharshi | కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ చొరవతో చారిత్రక పురుషుల, సంఘ సంస్కర్తల, మహనీయుల జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప సంప్రదాయని, ఆయా వర్గాలకు ఆత్మగౌరవ సూచిక అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దిక్సూచిగా నిలువడం గర్వకారణమన్నారు.
నిజమైన ప్రజాస్వామ్య, ప్రజారంజక పరిపాలకుడిగా సీఎం కేసీఆర్ చెరగని స్థానాన్ని చరిత్రలో సుస్థిరం చేసుకున్నారన్నారు. ప్రజల జీవవ ప్రమాణాల మెరుగుదలకు శాశ్వత పరిష్కారందిశగా ప్రణాళికాబద్ధంగా బాటలు వేశారన్నారు. భగీరథ మహర్షి రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవం ఈ నెల 27న రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది. ఈ సందర్భంగా తెలంగాణ సగర సంఘం ముద్రించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్, ప్రతినిధులు సత్యం, కేపీ రాములు, రామ్, పల్లవి సుధీర్, రవి, వెంకట స్వామి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

