కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 22 నుంచి 31 వరకు ఢిల్లీలో ‘షహర్ సమృద్ధి ఉత్సవ్’ పేరిట నిర్వహించే స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌కు వరంగల్ మహిళా సంఘాలు ‘భద్రకాళి’ బ్రాండ్ పేరిట ఉత్పత్తి చేస్తున్న ప్లవర్ ధూప్‌స్టిక్స్, దర్రీస్ ఎంపికయ్యాయి. రసాయనాలు వాడకుండా పూల పొడితో తయారు చేస్తున్న ధూప్‌స్టిక్స్, డోర్ మ్యాట్లు, కర్టెన్లు, యోగా మ్యాట్లు, కార్పెట్లను ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నారు. ఢిల్లీ ఎగ్జిబిషన్‌కు ఎంపికైన దేశంలోని మహిళా సంఘాల ఉత్పత్తులను ‘సోన్చిరయా’ బ్రాండ్ ట్యాగ్‌తో విక్రయించనున్నారు. వరంగల్‌కు చెందిన 2వేల ఉత్పత్తులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లోకి రానున్నాయి. ఈ మేరకు సంస్థతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. – వరంగల్