హనుమకొండ : హనుమకొండ జిల్లా ఖాజీపేట మండలం విష్ణుపురిలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ (Shwetarka Moola Ganapati Temple) వ్యవస్థాపకులు, భద్రకాళీ దేవస్థానం(Bhadrakali Devasthanam) ఆస్థాన సిద్దాంతి, బ్రహ్మశ్రీ అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి(Anantha Mallya Sharma Siddhanti) కొద్ది సేపటి క్రితం కాలం చేశారు. హైదరాబాద్లోని మెడికవర్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం కన్ను మూశారు. ఆధ్యాత్మిక సేవలో తరిస్తూ ఎంతో మందికి మార్గదర్శంన చేస్తున్న సిద్ధాంతి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మల్లయ్య శర్మ సిద్ధాంతి శివైక్యం పట్ల పలువురు సంతాపం తెలిపారు.