పాల్వంచ, మే 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సతీమణి శ్రద్ధ పాల్వంచ ప్రభుత్వ దవాఖానలో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో కలెక్టర్.. తన సతీమణి గర్భం దాల్చినప్పటి నుంచి పాల్వంచ ప్రభుత్వ దవాఖానలో పరీక్షలు చేయించడంతోపాటు వైద్యుల సూచన మేరకు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నారు.
జిల్లా వైద్య సమన్వయ అధికారి రవిబాబు, దవాఖాన సూపరింటెండెంట్ రాంప్రసాద్, సర్జన్ సోమరాజు దొర, అనస్తీసియా డాక్టర్ ప్రసాద్ సమక్షంలో నర్సింగ్ ఆఫీసర్ స్వర్ణలత, గైనకాలజిస్టు సరళ, అనూష సిజేరియన్ చేయడంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు.