హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, డిగ్రీ పట్టభద్రుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) కోర్సుకు విశేష స్పం దన లభిస్తున్నట్టు అధికారులు ప్రకటనలో తెలిపారు. అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి బ్యాం కింగ్ ఆపరేషన్స్, ఫైనాన్షియల్ మారె ట్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, అప్లికేషన్ అండ్ డాటాబేస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్ సిల్స్పై యంగ్ ఇండియా సిల్ యూ నివర్సిటీ(వైఐఎస్యూ)లో శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో ఉద్యోగావకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. ఐదు నెలలపాటు కొనసాగే ఈ కోర్సులో ప్రవేశాల కోసం ఆదివారం పరీక్ష నిర్వహించినట్టు, ఉత్తీర్ణత సాధించినవారికి జూలై వరకు శిక్షణ ఉంటుందని వివరించారు. విద్యార్థులు అడ్మిషన్ ఫీజు కింద రూ. 5వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.