హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థల్లో ఖాళీగా ఉన్న సహాయ ఇంజినీర్(ఏఈ) పోస్టులను భర్తీచేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్ఈఏఈఏ) కోరింది. అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం బేగంపేటలోని ప్రజాభవన్‌లో ఆవిష్కరించారు.
ఏఈ అసోసియేషన్ 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు జీ పవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి టీ మహేశ్, వీ మహిపాల్, ఆర్ సాయిపవన్, జీ దయానంద్, జీ శ్రీకాంత్, టీ నవీన్, పీ శ్రీకాంత్, ఏ శ్రీనివాస్, రాకేశ్, జమీరుద్దీన్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.