హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఉద్యోగోన్నతి పొందిన ఐఏఎస్ అధికారి శ్రీదేవసేనకు మంగళవారం పలువురు విద్యాశాఖ అధికారులు, ఉ ద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. సై ఫాబాద్‌లోని విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు డైరెక్టర్ లింగయ్య, జే డీ మదన్మోహన్, ఎన్ఎస్ఎస్ ప్రసా ద్, టీఎన్జీవో అధ్యక్షుడు ఫణిరాజ్, దు ర్గారాణి, కృష్ణమోహన్‌రెడ్డి, ప్రశాంతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.