మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 16 : మహబూబ్‌నగర్ జిల్లా ‘నమస్తే తెలంగాణ’ ఫొటోగ్రాఫర్ బందగీ గోపి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. గత ఏడాది ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్లను ఎంపిక చేయగా సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా గోపి అవార్డును అందుకోనున్నారు. రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన గోపికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఫొటో, వీడియోగ్రాఫర్లు అభినందనలు తెలిపారు.