హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ) : బెస్ట్ అవలైబుల్ స్కీమ్ బకాయి నిధులను వెంటనే చెల్లించాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నిధుల విడుదలపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ సోమవారం ఉదయం 11గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఈ మేరకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీల ప్రధాన కార్యదర్శులు సైలాబ్బాబు, ఆర్ శ్రీరాంనాయక్, నాగరాజు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.