బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 13 : స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు మద్దతు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో దేవారం సాయిరెడ్డి డబుల్ బెడ్రూం కాలనీలోని 50 కుటుంబాల వారు ఏకగ్రీవ తీర్మానం చేశారు. బుధవారం వారు బాన్సువాడలో స్పీకర్ను కలిసి తీర్మాన ప్రతిని అందజేశారు.