ఐనవోలు, నవంబర్ 21 : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని కొండపర్తిలో బెల్ట్‌షాపు నిర్వాహకుడిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ‘బెల్ట్ షాపును ప్రారంభించిన కాంగ్రెస్ నేత’ శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించారు. బెల్ట్ షాపు నిర్వాహకుడు పోశాల రమేశ్‌ను రూ.2 లక్షల పూచీకత్తుతో గురువారం తహసీల్దార్ విక్రమ్‌కుమార్ ఎదుట బైండోవర్ చేసినట్టు ఖిలా వరంగల్ ఎక్సైజ్ సీఐ రాజు తెలిపారు.