హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బెజ్జోర గ్రామంలోని బెజ్జందేవి గుడిలో ఉన్న శిల్పం పాలురికి సోమనాథుడు బసవపురాణంలో పేర్కొన్న బెజ్జమహాదేవి శిల్పమేనని కొత్త తెలంగాణ పరిశోధన బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒడిలో శిశువుతో ఉన్న ఆ విగ్రహం శివుణ్ణి పాపడిని చేసి లాలిస్తున్నట్టుగా ఉన్న బెజ్జమహాదేవి ప్రతిమను గుడిలో ప్రతిష్ఠించారని చెప్పారు. ఇది అరుదైన చారిత్రక సంఘటన అని, వీరశైవభక్తుల శిల్పాలలో అకమహాదేవి విగ్రహం ప్రసిద్ధమైందని వివరించారు.