హైదరాబాద్ : కొల్లాపూర్ మాజీ సంస్థానాదీషుల 1600 ఎకరాల భూమిని తానే కాపాడిన అని మంత్రి అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా హర్షవర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కొల్హాపూర్ సంస్థానానికి సంబంధించి జూపల్లి చేసింది ఏమీ లేదన్నారు. 2021లోనే తాము సంస్థానం కోసం పని చేశామన్నారు. ఇటీవల స్థానిక కలెక్టర్ ఆ భూమికి సంబంధించి ఆదేశాలు జారీ చేసారు.
ఒక వ్యక్తికి ఇంతా భూమి ఉండదు అని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ భూమి ని కాపాడింది అప్పుడున్న మా బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. ఇకనైనా మంత్రి చూపల్లి మాపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. జూపల్లికి వయసు పెరిగినా.. బుద్ధి పెరగలేదని ఎద్దేవా చేశారు. మరోసారి ఇలా చేస్తే పరువునష్టం దావా వేసి కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న 44 ఎకరాల సీలింగ్ భూముల్ని అమ్మారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మీ మిత్రపక్షం సీపీఐ మీ దృష్టికి తెచ్చినా స్పందించలేదు ఎందుకు అని ప్రశ్నించారు.
టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో చెట్లు ఎలా కొట్టారు? ఎవరు చేస్తున్నారు? ఎవరి అండ చూసుకుని ఇలా చేస్తున్నారు? అడవిని కొట్టిన, కాల్చినవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ప్రైవేటు ఆస్తులపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు. నాగర్కర్నూల్ జిల్లాకు 30 లక్షల గోనె సంచులు రావాలి. లేదంటే BRS అడుగడుగునా పోరాటం చేస్తుందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి నియోజకవర్గానికి మంచి చేయాలన్నారు. ఈ ల్యాండ్ కి సంబంధించి న్యాయ విచారణ చేపట్టండి. మా తప్పుంటే దేనికైనా సిద్ధం. జూపల్లి తప్పు ఉంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా? అని సవాల్ విసిరారు.