బీరు సీసాలో తేలు.. బెంబేలెత్తిన మద్యంప్రియులు
బీరుసీసాలో తేలు ప్రత్యక్షమైన ఘటన జనగామ జిల్లా నర్మెటలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. నర్మెటకు చెందిన కన్నెబోయిన కరుణాకర్, మరో వ్యక్తితో కలిసి స్థానికంగా గల ఓ వైన్స్లో రెండు బీర్లు కొనుగోలు చేశారు.
నర్మెట, జనవరి 31: బీరుసీసాలో తేలు ప్రత్యక్షమైన ఘటన జనగామ జిల్లా నర్మెటలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. నర్మెటకు చెందిన కన్నెబోయిన కరుణాకర్, మరో వ్యక్తితో కలిసి స్థానికంగా గల ఓ వైన్స్లో రెండు బీర్లు కొనుగోలు చేశారు. బీరు తాగేందుకు బాటిల్ మూత తీసి గ్లాసులో బీరు పోశారు.
కొంచెం తాగగానే దుర్వాసన రావడంతో బీరు బాటిల్ను పరిశీలించి చూడగా అందులో చనిపోయిన తేలు కనిపించింది. వెంటనే వారు బీరు సీసాతో వెళ్లి వైన్స్ యజమాని అడగ్గా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు కొద్దిసేపు మద్యం షాపు ఎదుట నిరసన తెలిపారు. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎక్సైజ్ అధికారులు అందుబాటులోకి రాలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

