హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : సురక్షిత సమాజం కోసం రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు తెలుపాలని, మహిళల రక్షణలో బాధ్యులు కావాలని వింగ్ డీజీ శిఖాగోయెల్ ఎక్స్ వేదికగా కోరారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలపై స్వీయ అవగాహన అవసరమని తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించే విషయాల గురించి తెలుసుకోవాలని సూచించారు. గృహహింస, లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తమ పరిసరాల పరిధిలో ఎవరైనా అలా చేస్తే.. డయల్ 100కు కాల్ చేయాలని పిలుపునిచ్చారు. మహిళలపై జరిగే నేరాలు, లైంగిక వేధింపులు, ర్యాగింగ్, గుడ్, బ్యాడ్టచ్ వంటి అంశాలపై ఇంట్లోని మగ పిల్లలకు తెలియజేయాలని శిఖాగోయెల్ చెప్పారు.