హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే ప్రథమస్థానం పొందిన తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని, మీరు కూడా గర్వపడాలని ఎస్హెచ్వోలకు డీజీపీ డాక్టర్ జితేందర్ సూచించారు. శనివారం ఎస్హెచ్వోల మీటింగ్లో ఆయన మాట్లాడారు. పనితీరు, విధానాలను పరిశీలించి మన పోలీస్ సిబ్బంది శిక్షణ, రిసెప్షన్, తదితర 32 అంశాలను బేరీజు వేయడం ద్వారా దేశంలోనే మొదటి స్థానాన్ని పొందామని తెలిపారు. ఎస్హెచ్వోల పనితీరు తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టామని తెలిపారు. శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్ ఎం భగవత్ మాట్లాడుతూ.. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల్లో, సిబ్బందిలో మంచి పేరు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.
23తో ముగియనున్న ‘ఆర్జేసీ సెట్’ గడువుహైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగుస్తుందని సంస్థ కార్యదర్శి రమణకుమార్ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు ఈ నెల 23లోపు http://tgrjc. cgg. gov.in వెబ్సైట్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మే 10న నిర్వహించే పరీక్షకు ఇప్ప టి వరకు 60వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. వివరాలకు 040-24734899ను సంప్రదించాలని సూచించారు.