హైదరాబాద్: మా వద్ద పెట్టుబడి పెట్టండి..రెట్టింపు లాభాలు పొందండంటూ మీ ఫోన్లకు వాట్సాప్, ఇతర సోషల్ మీడియాకు సంబంధించి యాప్‌లలో మెసేజ్‌లు, లింక్‌లు వస్తున్నాయా..? తస్మాత్ జాగ్రత్త. అత్యాశకుపోయి అనవసరంగా లింకులు క్లిక్ చేస్తే మీ జేబులు ఖాళీ అయినట్లే. ప్రధానంగా 14 యాప్‌లు, లింక్‌లతో జర భద్రం. అవి.. అమెజాన్ పుష్ యాప్, పవర్ బ్యాంక్ యాప్, టెస్లా యాప్, గోల్డ్ వింగ్స్ యాప్, సూపర్ లింక్ యాప్, గోల్డ్ రింగ్స్ యాప్, లక్కీ స్టార్ యాప్, గాడ్ లక్ యాప్, ఈ-బే 505.కామ్, 38 క్లబ్ యాప్, జెప్బిట్ యాప్, లాట్బెట్ యాప్, ఎల్డీవై04.కామ్, టీ టాడ్స్ యాప్‌లు. వీటితో వచ్చే మెసేజ్‌లు,లింక్‌లకు అసలు స్పందించొద్దని సైబర్‌క్రైం పోలీసులు సూచిస్తున్నారు.