ఖైరతాబాద్, అక్టోబర్ 14 : కులగణన అయితదా…పోతదా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెటకారంగా మాట్లాడాన్ని ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ సామాజికవర్గంలో పుట్టిన బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం యావత్ బీసీ సమాజం వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. ఇప్పటికే ప్రధాని మోదీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకువచ్చి బీసీలకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కులగణనపై ఆటంకాలు సృష్టించాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. 16న తెలంగాణ వ్యాప్తంగా జ్యోతిరావుఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాభిషేకం, 20న అఖిలపక్ష సమావేశాలు, 22న బీసీ మేథావులతో బీసీ కులగణనపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు గణేశ్‌చారి, ఎస్ దుర్గయ్యగౌడ్, ప్రొఫెసర్ బాగయ్య, గూడూరు భాస్కర్, వెంకటేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
కులగణనపై 24 నుంచి జిల్లా పర్యటనలు ;బీసీ కమిషన్ నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్14 (నమస్తే తెలంగాణ) : కులగణనపై అధ్యయనం, అభిప్రాయాల సేకరణలో భాగంగా ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని రాష్ట్ర బీసీ కమిషన్ నిర్ణయించింది. బీసీ కమిషన్, ఉన్నతాధికారులు సోమవారం సమావేశమయ్యారు. కులగణన కోస ం చేస్తున్న సన్నాహకాలను కమిషన్‌కు ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ ప్ కుమార్ సుల్తానియా వివరించా రు. బీసీ కమిషన్ పర్యవేక్షణలో కులగణన నిర్వహించాలని సమీక్షలో నిర్ణయించారు. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు పాల్గొన్నారు