హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీస్స్ లాంగ్‌టర్మ్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) కోచింగ్-2026 తరగతులను జూలై 27 నుంచి ప్రారంభించనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు క్లాసులు కొనసాగుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సైదాబాద్ లక్ష్మీనగర్‌కాలనీలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. 150 మందికి కోచింగ్ ఇస్తామని.. 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను జూలై 12న నిర్వహించే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తామని వివరించారు.
మరో 50 మంది అభ్యర్థులను గతంలో సివిల్ సర్వీసెస్(ప్రిలిమ్స్) పరీక్షలో ఉత్తీర్ణులైన వారి నుంచి ఎంపికచేస్తామని స్పష్టంచేశారు. ప్రవేశం పొందిన అభ్యర్థులకు వసతి, రవాణా కోసం నెలకు రూ.5 వేల చొప్పున ైస్టెఫండ్, రూ.5 వేలు బుక్‌ఫండ్ ఒక్కసారి అందజేస్తామని వెల్లడించారు. గ్రంథాలయ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల ఎంపిక కోసం దరఖాస్తులను జూన్ 16 నుంచి జూలై 7 వరకు ఆన్లైన్లో www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా అప్లోడ్ చేయాలని కోరారు. వివరాలకు 040-24071178 నంబరును సంప్రదించాలని సూచించారు.