ఖైరతాబాద్, జూన్ 30 : విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లు వెంటనే చె ల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీసీ విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారని నిలదీశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటి నా రూపాయి విడుదల చేయలేదని మండిపడ్డారు. కేవలం రూ.100 కోట్లు విడుదల చేసి చేతులు దలుపుకోవాలని చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీశ్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం నేతలు రాజేందర్, సిద్ధూయాదవ్, శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు.