హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈనెల 7న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తుంటే, రాముడి బొమ్మను చూపి బీసీలను నరేంద్రమోదీ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.