రవీంద్రభారతి, జూన్ 4: తెలంగాణలో బీసీలను అణగదొక్కేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే బీ సీవాదాన్ని నీరుగార్చేందుకే ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తెలంగాణపై విషం చి మ్ముతున్నారని బీసీ ఇంటలెక్చువల్ ఫో రం చైర్మన్ టీ చిరంజీవులు విమర్శించా రు. ఇదంతా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. బషీరాబాగ్ దేశోద్దారక భవన్లో బీసీ ఇంటలెక్చువల్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొన్ని అగ్రకుల రాజకీయ శక్తులు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్ర యత్నిస్తున్నారని చిరంజీవులు విమర్శించారు.
పవన్ వెనుక బీజేపీ, టీడీపీ రాజకీయ మద్దతు ఉన్నదని ఆరోపించారు. అగ్రకుల పాలకుల కుట్రలను బీసీలు గమనిస్తున్నారని, ఎన్ని కుయుక్తులు పన్నినా 2029లో రెండు రాష్ర్టాల్లో బహుజన రాజ్యం రావడం ఖాయమన్నారు. బడుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన పవన్.. ఆ హామీలను నెరవేర్చకుండా ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని బీసీ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్‌రాజ్‌గౌడ్ విమర్శించారు. బీసీ నాయకులు వెంకన్నగౌడ్, నారాయణగౌడ్, విజయకుమార్‌గౌడ్, దుర్గయ్య ఉన్నారు.