హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని, ఓబీసీ సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల్ దివాస్ వేడుకలు, కుల గణన, ఓబీసీల సమస్యలపై నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఎంపీలు ఆర్ కృష్ణయ్య, వద్దిరాజు రవిచంద్ర, నాయకులు విల్సన్, యోగేంద్రయాదవ్, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.