హైదరాబాద్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ జలసౌధ వద్ద బీసీ ఉద్యోగుల సంఘం నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించామని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమాదేవి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రమోషన్లలో బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని, కీలక శాఖలకు సంబంధించి హెచ్‌వోడీల బాధ్యతలను అప్పగించడంలో బీసీ ఉద్యోగులకు ప్రాధాన్యమివ్వాలని డి మాండ్ చేశారు. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ నేతలు, కులచర్ల శ్రీనివాస్, పద్మ నళిని, జ్యోతి శీలం, రాధారాణి, మెడికల్ బీసీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.