హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో పలువురు మత్స్యకార కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన అంశాన్ని రాష్ట్ర బీసీ కమిషన్ సీరియస్గా తీసుకున్నది. ఘటనపై పూర్తిస్తాయిలో విచారణ జరపాలని కలెక్టర్ ప్రావీణ్యకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశాలు జారీ చేశారు.
మత్స్య సహకార సంఘంలో అవకతవకలు జరిగాయని పలు మత్స్యకార కుటుంబాలు నిలదీయగా, వారిని కుల బహిష్కరణ చేశారు. దీనిపై బీసీ కమిషన్ స్పందించింది.