హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : చేనేత సమస్యల పరిష్కారంపై బీసీ కమిషన్ సభ్యుడు రాపోలు జయప్రకాశ్ తయారుచేసిన ప్రతిపాదనలను సోమవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బీసీ కమిషన్ పంపింది.
ఈ రంగానికి తగ్గుతున్న బడ్జెట్ కేటాయింపులు, పెరుగుతున్న తయారీ ఖర్చులు, ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థీకృత ఆర్థిక సంస్థల నుంచి రుణ సౌకర్యాలు తగ్గిపోవడం వంటి వివిధ అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన వివిధ చర్యలను ప్రతిపాదనల్లో వివరించారు.