హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమారతో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కులాలకు సంబంధించిన పేర్లలో మార్పులు, చేర్పులు తదితర అంశాలపై చర్చించారు.
సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మీరంగు పాల్గొన్నారు.