చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలి : బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్
BC Commission member | చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీలో చేనేత ఉత్పత్తులపై 5శాతం పన్ను విధించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ.. తెలంగాణ చేనేత, జౌళీశాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఎస్టీలో చేనేత ఉత్పత్తులపై 5శాతం పన్ను విధించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ.. తెలంగాణ చేనేత, జౌళీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు అంబర్‌పేటలోని పోస్టాఫీస్ వద్ద చేనేత ఉత్పత్తిదారులు, యువకులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కిశోర్ పోస్టుకార్డులు రాశారు.
తరతరాలుగా చేతివృత్తులు, కులవృత్తులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి అండగా నిలబడి ఆదరించాలన్నారు. రాయితీలు, సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి.. మోదీ ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీ విధించడం బాధాకరమన్నారు. వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జీఎస్టీని రద్దు చేసే వరకు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జీవన్, ప్రభాకర్, నిరంజన్, అశోక్, ఉమేశ్, రాజు, రమేశ్, భూమేశ్, వెంకటేశ్, కృష్ణ, రాజేష్, అంజి, చిన్ని తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

