ఖైరతాబాద్, ఆగస్టు 11: బీసీలు సంఘటితమైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్కొన్నారు. బీసీ సంఘాల ఐ క్యవేదిక ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని మాడ్ర న్ ఫంక్షన్హాల్లో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కా టం నరసింహయాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ.. బీసీలు ఐక్యమైతే సాధించలేనిది ఏదీ ఉండదని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో బీసీ నేతలు శాంతికుమార్, వెంకటేశ్‌గౌడ్, ఆంజనేయులుగౌడ్, తమ్మురు శ్రీరాములు, కోరే రాజ్‌కుమార్, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): రాఖీ పండుగ సందర్భంగా కలిసి పండుగ చేసుకునే అవకాశం లేని తోబుట్టువుల కోసం టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి కార్గో సెంటర్లలో కౌంటర్లు తెరిచి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి రాఖీలు సులభంగా పంపే వీలుకల్పిస్తున్నది. రాఖీలతోపాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామగ్రి ని కూడా పంపే అవకాశం కల్పిస్తున్నది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాలకు రాఖీలు పంపించుకునే సదుపాయం కల్పిస్తున్నది. ఇందుకోసం అన్ని బస్టాండ్లలోని కార్గో సెంటర్లలో కౌంటర్లు ఏర్పాటు చేశారు.