కొండాపూర్, డిసెంబర్ 13 : దేశ రక్షణ అవసరాలకు కావాల్సిన యుద్ధ ట్యాంకులను ఆధునిక టెక్నాలజీతో తయారుచేస్తున్నామని, సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేశానికి తలమానికం అని కందిలోని ఓడీఎఫ్ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ శివశంకర ప్రసాద్ పేర్కొన్నారు.
శుక్రవారం కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో రెండు యుద్ధ్ద ట్యాంక్లను ట్రయల్న్ చేశారు. యుద్ధ్ద సమయంలో సైనికులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి ఈ యుద్ధ ట్యాంకులు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఆర్మీకి ఇప్పటి వరకు 2 వేలకు పైగా యుద్ధట్యాంకులను కంది ఓడీఎఫ్ నుంచి పంపించినట్టు చెప్పారు.