హైదరాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఫిలిం డెవలప్మెం ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ చాలెంజ్-2025’ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో జరుగనున్నట్టు ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు వెల్లడించారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై షార్ట్ ఫిలిమ్స్తోపాటు పాటలను ఆహ్వానించనునట్టు తెలిపారు. ఉత్తమ ఫిల్మ్, పాటలను ఎంపికచేసి నగదు పురస్కారాలతోపాటు సర్టిఫికెట్లు అందజేయనున్నట్టు చెప్పారు.