బతుకమ్మ సంబురం.. అక్టోబర్ 2 నుంచి ఆడబిడ్డలకు సర్కార్ కానుక..
Bathukamma Sarees | తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. తెలంగాణ ఆడబిడ్డలు తారతమ్య బేధం లేకుండా సంబురంగా జరుపుకునే పండుగ ఇది.. పండుగ పూట ఏ ఆడబిడ్డ ముఖం చిన్నబొవద్దనే ఉద్దేశంతో

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. తెలంగాణ ఆడబిడ్డలు తారతమ్య బేధం లేకుండా సంబురంగా జరుపుకునే పండుగ ఇది.. పండుగ పూట ఏ ఆడబిడ్డ ముఖం చిన్నబోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏడాది పెద్ద మనసుతో ఆడబిడ్డలకు సారెలను కానుకగా అందిస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ సంవత్సరం 30 సరికొత్త డిజైన్లను రూపొందించి వాటిని 20 విభిన్న రంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చీరలన్ని జరి అంచులతో తయారు చేయబడి, 100 శాతం పాలిస్టర్ ఫిలిమెంట్, నూలుతో తయారు చేయబడినవి.
ఇప్పటికే జిల్లా కలెక్టర్లచే ఎంపిక చేయబడిన గోదాములకు బతుకమ్మ చీరలు చేరినవి. గ్రామ, వార్డు స్థాయి కమిటీల ద్వారా అక్టోబర్ 2 నుంచి గ్రామాల్లో చీరల పంపిణీ జరగనుంది.
2017లో 95, 48,439 మంది మహిళలకు, 2018 లో 96,70,474 మందికి, 2019 లో 96,57,813 మందికి, 2020 లో 96,24,384 మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ ఏడాది కోటి మందికి పైగానే చీరలను పంపిణీ చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

